Monday, September 17, 2012


నీ లోచనాలు... 
ఈ లోకాన్ని పట్టి చూపుతున్నాయి
నా లోపాన్ని తట్టి లేపుతున్నాయి 

Tuesday, September 4, 2012


మై హైదరాబాద్ సే బోల్ రహా హూం...


ఒక్కసారి ఒచ్చిపో మమ్మల్ని యాద్ మరిస్తే అపుడు చెప్పు
మా పరేషాన్ లని షేర్వాన్లలో దాస్తాం
చార్ సౌ కే ఊపర్ షహర్ హమారా
అయిదు రూపాల గరమిరానీ ఛాయ్
నీ ఆవేదన అంతా తీరు భాయ్
ఒక్కడివే ఉన్నా ఒన్ బై టూ చెప్తే 
అది పిచ్చి కాదు - మా 'షేర్' తనం! 
చుడీ బజార లాడ్ బజార్ ఆకే దేఖో 
రేష్మీ జుల్ఫేలకూ గలగలా గాజులకూ అడ్డా ఈ గడ్డా
అసెంబ్లీ ఆపోజిట్ జంజంలో దాల్ రైస్
అరె పాగల్ బీస్ రూపేమే స్వర్గమ్ మరెక్కడైనా దోర్కుతాద్ బే
ముషీరాబాద్ అంటే భోలాక్ పూర్ మురికి నీళ్ళే కాదురా
అల్ ఇబ్రహీం కల్యాణి బిర్యానికి ఉరికి వెళ్ళురా 
కళ్ళు పస్కలా.. బార్కాస్ వో
నస్కుల్నే బార్కాస్ వో
యునానీ దావాసాజ్, బిర్యానీ - పస్కల్ మటాష్ 
బొక్కలిర్గినయా... శాలిబండవో బిడ్డా
లష్కర్ ముచ్చట ఇగ ఏంజెప్తవ్ తీయ్
అల్ఫాలో బన్ మస్కా దిన్నవంటే దీంతల్లి...
మాటలొస్తలేవే!
నీసు ఒద్దా... గోష్ వొద్దా... 
ఉందికదా చిక్కడపల్లి సుధ 
చార్మినార్ చౌరస్తా సంగంలో పప్పుదిని చెప్పు
చున్నీల కోసం మదీనా సెంటర్
చన్నీ హతోడీలు జుమేరాత్ బజార్ 
నూర్ఖాన్ బజార్లో తారామతి బారాదరీలో
ఖవ్వాలీకి రా బనాదో తుమ్హారా షామ్ మస్తానీ రంగీనీ
అట్లా దివానా లెక్క జూడకు 
ఏం గావాల్నో జెప్పు ఇయ్యకపోతే ఈ హైదరాబాదీ తప్పు 
డబీర్ పురా.. కాలాడేరా.. టప్పచాబూత్ర ఆజంపురా
ఏ సెంటర్ కైనా రా... నువ్వోచ్సినా సరే ననురమ్మన్నా సరే
జీవితం జీవితం గా ఉంటది.. 
దీనమ్మ సావు.. గుర్తొస్తే కోలాపురి చెప్పుతో కొట్టు 

- శ్రీశైల్ రెడ్డి పంజుగుల 

త్రిపాది 

నాకవనంలో విహారి
నువ్విరి నే భ్రమరి 
నాకానికి దగ్గరి దారి

నీలోలోపలికి చేరుతున్నా గడసరీ
కాదు నేను పిచ్చీ వెర్రీ 
వేళ్ళతో పాటు ఊడలూ దించుతున్న మర్రి!

Monday, September 3, 2012



ఓ నా ఉత్తి సుత్తి మేఘమా



ఓ నా ఉత్తి సుత్తి మేఘమా
మందగమనంతో మొహం మొత్తించకే
రష్యాలా గర్జించు లేదా గాండ్రించు
ఎడాపెడా కురిసెయ్ చిత్తడి చెయ్
ధైర్యం చాలదా? అయితే దొబ్బెయ్ 
ఉత్తుత్తి మాటలు కావు నావి
చూడు చూడు ఎరుపు జీరలు
కాదు కాదు భాస్వరపు గోళాలు
ఉఫ్ ఉఫ్ మని ఊదితే 
ప్రళయఘోషో ప్రణయ శోషో తప్పదంతే! 

Sunday, September 2, 2012


నేను తీపి ముక్క... 



నేను తీపి ముక్క
తనకు డయాబెటిస్ 
నేను గంధపు చెక్క
తనకు తీరని జలుబు
నేను వగరైన వక్క
తనకు పంటి నొప్పి
నేను మత్తైన చుక్క
తనకు శ్రావణ మాసం