Monday, February 25, 2013
ముద్దయిన రాత్రిలో
మరోసారి రా ప్రేయసీ
ఈ వర్ష హర్షంలో
మరల రా ప్రేయసీ
గుండెచపుడా నీ ప్రేమగానమా
నా హృదయపు తంత్రుల్ని మీటేది
లిప్త పాటులో గుండె జారింది
నను రిక్తం చేసి నిను చేరిందది
నయనాల ప్రేమనిధితో
మరల రా ప్రేయసీ
నీ తలపులు మదిలో రొదలు
పునరాగమంపై పూర్తి విశ్వాసిని
విచ్చుకున్నవి కరములూ కనులూ
మొన్నటి మెరుపులతో మురిపించు
మరల రా ప్రేయసీ
పోనీ నా తలపుల్లోకైనా
పోనీ నా తలపుల్లోకైనా
మరల రా ప్రేయసీ
ముద్దయిన రాత్రిలో
మరోసారి రా ప్రేయసీ
ఈ వర్ష హర్షంలో
మరల రా ప్రేయసీ
'భీగీ భీగీ రాతోంమే ఫిర్ తుమ్ ఆవోనా' కి నా స్వేచ్చానువాదం
(హిందీ మూలం: http://www.sangeethouse.com/lyrics/pop-song-Bheegi-Bheegi-Raton-Mein-music-adnan_sami_-_best_of_adnan_sami_khan.html)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment